Aug 17
Aug 13
Aug 10
hanumamtuDu
Telugu profashok
హనుమంతుడు పరీక్షల్లొ పెట్టిన ఇబ్బంది చెప్పాను కదా. మొదటిసారి పార్ట్ వన్ పరీక్షకి వెళ్ళినప్పుడు వాడేమాత్రం చదివాడో మీకీ పాటికి తెలుసు.ఎలెక్ట్రికల్ మెషిన్స్ ప్రాక్టికల్ కి వాడితో కలిసి భయం గానే వెళ్ళాను. సీతాపతిరావుగారు ఎక్స్టర్నల్ ఎక్జామినర్. వీడికి యేదో ప్రాక్టికల్ వస్తే నాకు రాదన్నాడు .నీకేదొచ్చు అని అడిగారాయన. వీడికి ఇండక్షన్ మోటార్ అయితే పెద్దగా యేమీ చెయ్యక్కరలేదని మాత్రం తెలుసు అందుకని అది చేస్తానన్నాడు. కాల్క్యులేషన్స్ యెక్కువ వున్నా ఆ సంగతి తరవాతనుకున్నాడు. కాని ముందుగానే వాణ్ణే వైవా కి పిలిచాడాయన. మరి వీడికేం రాదుగా. తెల్లమొహం కాస్సేపు చూసాక నీకేం తెలుసో చెప్పమన్నారాయన.జనరల్ ఫిజిక్స్ యేదైనా అడగమన్నాడు. ఆయన సరదాగా ఎలె క్ట్రాన్ స్పీడెంత అన్నారు. నేను నా ప్రాక్టికల్ మానేసి ఇది జాగ్రత్తగా వింటున్నాను.కరక్ట్ జవాబు చెప్పేశాడు . వూరుకోవచ్చుగా-- యెలా కొలుస్తావని అడిగాడాయన.కుర్చీలో ఇబ్బందిగా అటూఇటూ కదిలేక చెప్పేశాడు.186000 మైళ్ళ పొడుగున్న దారం ఒకటి తీసుకోండి. దానికి ఒక చివర ఎలెక్ట్రాన్ని వదిలి రెండో చివరికి యెంతసేపట్లో వెళుతుందో చూసుకోడమే.!!!! అవాక్కవడం అందరి వంతూ.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 07
hanumamtasastri
Telugu profashok
హనుమంతశాస్త్రి గురించి చెప్పాలంటే యెంతైనా ఉంది. మచ్చుకి ఇంకోటి చూడండి.మాకు ఎం ఎస్ సీ టెక్ రెండో స్మంవత్సరం చివరికి పార్ట్ వన్ పరీక్షలుండేవి. నిజానికి అవే ఆయువు పట్టు.పొద్దున్నే యెలక్ట్రానిక్స్ పరీక్ష వుందనగా అందరం బిగుసుకు పోయి చదివేస్తున్నాం.సడెంగా హనుమంతుడొచ్చాడు. నీ దగ్గర టెర్మన్ వుందా అంటూ.పొద్దున్న పరీక్షయితే యిప్పుడు టెర్మన్ చదువుతావా అనుకుంటూ మేం యెలానూ ముట్టుకునేది లేదు కదా అని యిచ్చాను.మళ్ళీ రాత్రి ఒకటిన్నరకి వచ్చాడు. ఇది చూసావా అంటూ. వీడేదో కనిపెట్టడని తెలిసిపోయింది. యేదిరా అన్నం. యీ మొదట్లో చూశావా-- అన్నాడు. చూశాం. మాకు కొత్తగా యేం కనిపించలేదు. యేం మనుషుల్రా. అసలైనది ఒదిలేసి ఊరికే బట్టీ వేస్తారు. అసలు యెలెక్ట్రాన్ గురించి యిక్కడ పూర్తిగా ఉంది చూశావా. ఇది చదివితే మొత్తం అంతా అర్ధమైపోతుంది. అన్నాదు.సరే అని సంతోషించి బాగా చదివేసై అని చెప్పాం . అంతకన్నా చేసేదేముంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 05
malli hello
Telugu profashok
నెల రోజుల పైనే అయింది ఇక్కడికి వచ్చి. ఇంత విరామం ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటా.ఈ నెలలో మొదటి విశేషం యేమంటే నేను ఇప్పుడు అమెరికాలో వున్నాను. రెండో తారీకున వచ్చాను. యెందుకూ అంటే జూన్ పదమూడున నాకు రెండో మనమరాలు పుట్టింది.దాన్ని చూడ్డానికి నేనూ మా ఆవిడా రెడ్ మాండ్ వచ్చాము.పెద్ద మనమరాలి పుట్టినరోజు నవంబరు పదకొండు. అప్పటిదాకా వుండి వెళదామనుకుంటున్నాము. ఈ సందడిలో కొంచెం రోజులు పాతమితృలనీ మంచి జ్ఞాపకాలనీ కొంచెం వెనక్కి పంపడం జరిగింది.మల్లికార్జునాచారి గురించి చెప్పాను కదా. ఇంకా మా లాబ్ బాచిలో తాతి నాగేశ్వరరావూ చతుర్వేదుల హనుమంతశాస్త్రీ వుండే వాళ్ళు.తాతి నాగేశ్వరరావు మంచివాడు తెలివైనవాడే కాని అంత విలక్షణత వున్న వాడు కాదు. ప్రాక్టికల్ పరీక్షలకి వచ్చేప్పటికి వచ్చే సరికి బాచికి ముగ్గురే కావడంతో ఎ హెచ్ ఎం అని నేనూ ఆచారీ హనుమంతశాస్త్రీ మిగిలి నాగేశ్వరరావు పక్క బాచికి వెళ్ళాడు. అది నాకు వరమో శాపమో తెలీని స్థితి వచ్చింది. వర్క్షాప్ ప్రాక్టికల్ కి వెళ్ళడానికి గంట ముందు నా రికార్డు యేదిరా అని వెతుక్కోడమ్మొదలు ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 03
Aug 02
మొసలి కన్నీరు
Telugu చరసాల
మనది కర్మ భూమి. “ఇది మన కర్మ, ఎవరిని నిందించి ఏమి ప్రయోజనం?”, “ఎప్పుడో చేసుకున్న పాప ఫలం ఇప్పుడు ఇలా అనుభవించాడు(రు).” ఇలా అనుకునే జనాలు, ఇలాంటి తలాతోకా లేని వాజమ్మ సిద్దాంతాలూ నమ్మే వారూ, వాటిని పకడ్బందీగా ప్రచారం చేసే ఉద్దండ పండితులూ వున్నంత కాలం, కాకతీయ ఎక్స్‌ప్రెస్ కాలుతుంది, గౌతమి మండుతుంది, బెంగుళూరు పేలుతుంది, అహ్మదాబాదు హాహాకారాలు చేస్తుంది.
ఎన్ని జరిగినా మనకు కానీ మన నాయకులక్కానీ చీమకుట్టినట్లుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 22
Jul 20
మన ప్రేక్షకుల దృక్పథం
Telugu అతిధి
పరిచయం:ఇంటర్నెట్, వందల కొద్దీ టి.వి ఛానెళ్ళు, డివిడిలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మన సినిమా ప్రేక్షకులు దృక్పథం మారిందేమో(మారిందా?), కానీ దాదాపు 65 ఏళ్ళ క్రితం మన సినిమా ప్రేక్షకుల దృక్పథం ఎలా వుండేదో తెలుసోకోడానికి 1944 లో రూపవాణి పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదవండి.
మన ప్రేక్షకులలో చాలామందికి చిత్రాన్ని ఏ విధముగా చూచి ఆనందించాలో కూడా తెలియదనడములో హేళన యెంతమాత్రమూ లేదు. దర్శకుడు చిత్రములో అక్కడక్కడ ప్రవేశ పెట్టిన సన్నివేశాలలోని అంతరార్థం గ్రహించకుండానే మన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 20
చలనచిత్ర సృష్టి కర్త-ఫ్రీస్ గ్రీన్
Telugu అతిధి
ఫిలిం పరిశ్రమకు , ఫిలిం పరిశోధనలకు ఫిలిం సృష్టి కర్తలకు కూడా అమెరికా జన్మస్థానము అని చాలా మంది అభిప్రాయము. కాని, ఫిలిం పరిశ్రమ విషయంలో అన్ని విధములా అగ్రస్థానం ఇంగ్లండుది. అసలు చలన చిత్రం యొక్క సృష్టి ఇంగ్లండులో జరిగింది. ప్రపంచం అంతటిలోనూ ప్రపధమ చలనచిత్రము ఇంగ్లండులో తయారు చేయబడింది.
ప్రపంచం అంతటిలోనూ మొట్టమొదట సినిమా హాలు ఇంగ్లండులోనే నిర్మింపబడింది. చలన చిత్రమునకే కాక మాట్లాడే ఫిలిమునకు కూడా ఇంగ్లండే జన్మస్థానం. మాట్లాడే ఫిల్ము ప్రప్రధమములో ఇంగ్లండులో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 19
Jul 18
మీకు Matthew Harding తెలుసా?
Telugu శిద్దారెడ్డి వెంకట్
Matthew Harding తెలియదా?
What the hell! మీరు తప్పకుండా ‘Where the hell is Matt?’ అనే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. 2006 లో మొదటి సారిగా యూట్యూబ్ లో పోస్టు చేసిన ఒక వీడియో ద్వారా ప్రపంచానికి పరిచం అయిన Matt ఇప్పుడు అతని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం ఉర్రూతలూగిస్తున్నాడు.
న్యూయార్క్ టైమ్స్ లో Matt గురించి ఇలా అన్నారు. “….taking you on a gorgeous tour of some exotic and [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 18
లేఖయుదె మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్
Telugu వారాల ఆనంద్
సినిమా నిర్మాణం ఆరంభం అయినప్పటి నుంచి అది అత్యంత ఆకర్షణీయ కళా రంగమే. వెలుగు జిలుగుల నడుమ మెరుస్తూ కనిపించే ఆ రంగం పట్ల ఆకర్షితులు కావడం అత్యంత సహజం. కాని పరమపదసోపానం లాంటి ఆ రంగంలోకి అడుగిడి అత్యున్నత స్థానం అందుకున్న వారు కొద్దిమంది వుంటే దయనీయమయిన అనుభవాలు ఎదురై జీవితంలో ఓటమి పాలయిన వారు ఎదగడానికి పడ్డ శ్రమ, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ మెరుపుల వెనకాల పొంచి ఉన్న [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 18
తప్పక చూడండి!
Telugu శిద్దారెడ్డి వెంకట్
1995 లో సినిమా అనే ప్రక్రియ మొదలయ్యి వంద సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా, 1895 లో లూమియర్ సోదరులు ఉపయోగించిన మొట్టమొదటి సినిమా కెమెరాను ఉపయోగించి, ప్రపంచంలోని 40 ప్రముఖ దర్శకులు ఒక నిమిషం లోపు నిడివి గల లఘుచిత్రాలు రూపొందించారు. ఒక్క నిమిషం లో ఏం సినిమా అనుకుంటే ఇక్కడ పొరపాటు పడ్డట్టే.ఈ సినిమాలు నిర్మించటప్పుడు వాళ్లకి మూడు నిమయాలు విధించారు. ఆ నియమాలను అనుసరిస్తూనే చాలా మంది దర్శకులు ఎంతో వినూత్నంగా ఈ సినిమాలను [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 18